కోమాలో నుంచి కోలుకున్నానని వెరై‘టీ’ విందు

3 Sep, 2022 19:46 IST|Sakshi

సాక్షి, చిల్పూరు: కోమలోనుంచి కోలుకున్న ఓ వ్యక్తి గ్రామస్తులకు వెరై‘టీ’ విందు ఇచ్చారు. 12 రోజులపాటు రోజుకు వంద మందికి ఇస్తానని ప్రకటించాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫత్తేపూర్‌ గ్రామానికి చెందిన గుగులోతు భిక్షపతి ఉప్పరి పని మేస్త్రీ. జూలై 13న ఇంట్లో సజ్జపైనున్న వస్తువును తీస్తూ జారిపడ్డాడు. తలకు దెబ్బతగిలి కోమాలోకి వెళ్లాడు. హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఆరు రోజుల తరువాత కోమానుంచి తేరుకున్నాడు. 

51 రోజుల చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జ్‌ అయి అతను స్వగ్రామం చేరుకున్నాడు. ఇది తనకు పునర్జన్మని, దాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు 12 రోజుల పాటు రోజుకు వందమందికి చాయ్‌ అందిస్తానని ప్రకటించాడు. గ్రామంలోని రవి హోటల్‌ వద్ద ఈ ‘టీ’ విందును సర్పంచ్‌ రూప్లానాయక్‌ చేతుల మీదుగా ప్రారంభించాడు. (క్లిక్‌: వాట్సాప్‌ గ్రూపునకు అడ్మిన్‌ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి)

మరిన్ని వార్తలు