జేఈఈ మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

22 Jun, 2022 00:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఇంజనీరిం గ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ తొలి దశ పరీక్ష ఈ నెల 23 నుంచి జరుగుతుంది. ఈ నెల 29 వరకూ జరిగే మొదటి విడత మెయిన్స్‌కు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అడ్మిట్‌ కార్డులను ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేసినట్టు ఎన్‌టీఏ పేర్కొంది.

అయితే, శనివారం నుంచే ఇవి డౌన్‌లోడ్‌ కావాల్సి ఉన్నా, సైట్‌ ఓపెన్‌ కాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్‌టీఏ మరో ప్రకటన విడుదల చేసింది. అడ్మిట్‌ కార్డులు తమ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చ ని,అందుకోసం విద్యార్థులు తమ అప్లికేషన్‌ నంబర్, పుట్టిన తేదీ ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసు కోవాలని తెలిపింది.    

మరిన్ని వార్తలు