JEE Mains 2022 Answer Key: ఆన్సర్‌ చేసినా ఆనవాలే లేదట.. జేఈఈ అభ్యర్థులకు చేదు అనుభవం

5 Jul, 2022 08:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్‌ పరీక్ష మునుపెన్నడూ లేనంతగా సమస్యలు సృష్టిస్తోంది. పరీక్ష రోజు గంటల తరబడి ఆలస్యం కాగా... ఇప్పు డు సమాధానం ఇచ్చిన ప్రశ్నలను కంప్యూటర్‌ లెక్కలోకి తీసుకోని చేదు అనుభవం అభ్యర్థులు చవిచూస్తున్నారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దేశవ్యాప్తంగా నిర్వ హించిన ఈ పరీక్షలో లోపాలు వస్తే వినే నాథుడే కన్పించడం లేదని విద్యార్థులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఎన్‌టీఏ జేఈఈ ప్రశ్నపత్రం కీ విడు దల చేసింది. అభ్యర్థులు లాగిన్‌ అయి చూసుకుని కలవరప డుతున్నారు. తాము ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే, తక్కువ ఇచ్చినట్టు చూపిస్తోందని అనేకమంది ఆందో­ళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక మహిళా ఇంజనీరింగ్‌ కా­లేజీలో పరీక్ష రాసిన విద్యార్థుల్లో దాదాపు పది మందికి ఇదే అనుభవం ఎదురైంది. అనుజ్‌ అనే విద్యార్థి 65 ప్రశ్నలకు కంప్యూటర్‌లో టిక్‌ పెడితే, రెస్పాన్స్‌ షీట్‌ మాత్రం 30 ప్రశ్నలకు బదులిచ్చినట్లే చూపింది.

మరో విద్యార్థిని భవిత్‌ 51 ప్రశ్నలు పూర్తి చేస్తే, 34 మాత్రమే చేసినట్టు వచ్చిందని తెలిపింది. ముద్ద యశ్వసిని అనే విద్యార్థిని 21 ప్రశ్నలు పూర్తి చేస్తే, రెస్పాన్స్‌ షీట్‌ లో అసలేమీ చేయలేదని వచ్చిందని వాపోయింది. దీనిపై ఎన్‌టీఏకి ఫిర్యాదు చే­సి­నా స్పందించలేదని, పొరపాట్లను సరిచేయకపోతే ప్రతిభావంతులు కూడా కనీస ర్యాంకుకు చేరుకోవడం కష్టమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు