తెలంగాణ సర్కార్‌కి జూడాల షాక్‌

25 May, 2021 18:45 IST|Sakshi

రేపటి నుంచి సాధారణ వైద్య సేవలు బంద్‌

మే 28 నుంచి కొవిడ్‌ సేవల బహిష్కరణ

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ సర్కార్‌కి జూనియర్‌ డాక్టర్లు షాక్‌  ఇచ్చారు. ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రేపటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా మిగితా వైద్య సేవలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.  ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మే 28 నుంచి కొవిడ్‌ అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని జూడాలు తేల్చి చెప్పారు. 

డిమాండ్లు
జనవరి 2020 నుంచి ఉపకార వేతనం పెంచాలని జూడాలు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పాటు విధినిర్వహణలో మృతి చెందిన జూడాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. జూడాలకు బీమా సౌకర్యంతోపాటు, తమ కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో కరోనా వైద్యం అందించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.  

వైరస్‌ తగ్గుతున్న వేళ
తెలంగాణలో కరోనా తగ్గుమఖం పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో జూనియర్‌ డాక్టర్లు విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అయితే 28 వరకు కొవిడ్‌ సేవలు కొనసాగిస్తామని జూడాలు హామీ ఇచ్చారు. అంతకు ముందే ఈ సమస్యకు  తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపే అవకాశం ఉంది. 
 

>
మరిన్ని వార్తలు