Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత

6 Aug, 2022 02:14 IST|Sakshi

ఈ ఏడాది తొలిసారి ఐదు గేట్లు ఎత్తిన అధికారులు  

జూరాలలో ఉదయం 27 గేట్లు ఎత్తి, సాయంత్రం 17 గేట్లు మూసివేత  

ఎస్సారెస్పీకీ వరదపోటు 

గద్వాల రూరల్‌/దోమలపెంట/బాల్కొండ: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతోంది. కర్ణాటకలో భారీగా వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతంగా వస్తోంది. దీంతో శుక్రవారం ఉదయం జూరాల ప్రాజెక్టు 27 క్రస్టుగేట్లు ఎత్తి 1,45,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సీజన్‌లో ఒకేసారి 27 గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి.

సాయంత్రం 6 గంటలకు వరద తగ్గడంతో 17 గేట్లు మూసి వేసి.. 75,005 క్యూసెక్కులు విడుదల చేశారు. రాత్రి 8 గంటల సమయంలో జూరాలకు 92 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మరోవైపు ఈ ఏడాది తొలిసారిగా శ్రీశైలం ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి.. సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి సాయంత్రం 6 గంటలకు 1,52,589 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యుదుత్పత్తి ద్వారా 62,896 క్యూò­Üక్కులు, స్పిల్‌వే ద్వారా 1,39,915 క్యూ­సెక్కులు, మొత్తం ప్రాజెక్టు నుంచి 2,02,811 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వి­డుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలా­శయంలో నీటిమట్టం 884.8 అడుగులు, 214.84 టీఎంసీల నీటి నిల్వ ఉంది.  

ఎస్సారెస్పీలోకి పోటెత్తిన వరద.. 
ఎస్సారెస్పీలోకి ఎగువ  నుంచి 88,470 క్యూసె­క్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 14 గేట్లను ఎత్తి 75 వేల క్యూసె­క్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నా­రు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091­(90 టీఎంసీలు) అడుగులు. కాగా శుక్రవారం రాత్రికి 1,088.6 (78.34 టీఎంసీలు) అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు.   

మరిన్ని వార్తలు