నేడు జస్టిస్‌ ఎన్వీ రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్‌

5 Aug, 2022 02:10 IST|Sakshi

రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇదే తొలి గౌరవ డాక్టరేట్‌ 

ఓయూ 82వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు ప్రదానం చేయనున్నట్లు వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ తెలిపారు. గురువారం ఆయన వర్సిటీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్, ఓయూ చాన్స్‌లర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధ్యక్షతన వర్సిటీ క్యాంపస్‌లోని ఠాగూర్‌ ఆడిటోరియంలో జరిగే 82వ స్నాతకోత్సవంలో ఈ డాక్టరేట్‌ను అందజేయనున్నట్లు చెప్పారు.

ఇది ఓయూ 48వ గౌరవ డాక్టరేట్‌ అని, 21 ఏళ్ల అనంతరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దానిని ప్రదా­నం చేస్తున్నామని వివరించారు. 361 మందికి పీహెచ్‌డీ డిగ్రీలు, వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులకు 55 బంగారు పతకాలు అందచేయనున్నట్లు వీసీ తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మీనారాయణ, ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ ప్రొ.శ్రీనగేష్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు