రోజుకో గెటప్‌.. తగ్గేదేలే.. రైతు వేషంలో కేఏ పాల్‌..

29 Oct, 2022 13:58 IST|Sakshi

నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నారు. ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో మునుగోడులో జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ మాత్రం తగ్గకుండా కేఏ పాల్ రచ్చ రచ్చ చేస్తున్నారు.మునుగోడులో గెలిచేది నేనే అంటూ కే ఏ పాల్ హల్‌చల్‌ చేస్తున్నారు.

రైతు వేష ధారణలో కేఏ పాల్ ఎన్నికల ప్రచారం తాజాగా మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో డాన్స్ చేస్తూ, స్టెప్పులేసిన కె ఏ పాల్, రోజుకో రకమైన గెటప్‌లతో​ చిత్రవిచిత్రంగా ప్రచారం చేస్తూ కాబోయే సీఎం తానేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న చెప్పులు కుడుతూ కనిపించిన కేఏ పాల్, తాజాగా రైతు వేషధారణలో ప్రత్యక్షమయ్యారు. తలకు కండువా కట్టుకుని చేతిలో కర్ర పట్టుకొని, రైతులతో కలిసి కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు