మునుగోడు నిరుద్యోగులకు కేఏ పాల్‌ బంపర్‌ ఆఫర్‌

20 Sep, 2022 19:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంచలన ప్రకటన చేశారు. మునుగోడు నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నట్టుగా తెలిపారు. తన 59వ జన్మదినం సందర్భంగా మనుగోడు నియోజకవర్గంలోని 59మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి వారికి పాస్‌పోర్ట్‌, అమెరికా వీసా ఉచితంగా ఇప్పించనున్నట్లు తెలిపారు.

మునుగోడు నిరుద్యోగ యువత రెజ్యూమ్‌లు తీసుకుని సెప్టెంబర్ 25న (ఆదివారం)  మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య శ్రీవారి హోమ్స్ గ్రౌండ్స్‌కు రావాలని సూచించారు. తన 59వ పుట్టినరోజు కానుకగా వచ్చిన ప్రతి ఒక్కరిలో లాటరీ ద్వారా 59 మందిని ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్టు చేయించి, అమెరికా వీసా స్పాన్సర్ షిప్ చేయించి ఇస్తానని వెల్లడించారు. తన జన్మదిన కానుకగా అందిస్తున్న సదావకాశాన్ని మునుగోడు యువత అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ మేరకు కేఏ పాల్‌ మంగళవారం వీడియో రిలీజ్ చేశారు.

మరిన్ని వార్తలు