కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత

3 Aug, 2020 10:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రాఖీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ  కట్టి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి సోదరుడు తన తోబుట్టువుకు ప్రతి  విషయంలో అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నారు. అన్ని ఇళ్లల్లో రాఖీ పండుగ హడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే తెలంగాణ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కవిత సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 

చదవండి: ఆమెతో రాఖీ కట్టించుకో, 11 వేలు ఇవ్వు: కోర్టు

అదేవిధంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా చెల్లెల్లు-అక్కా తముళ్లు ఎంతో ప్రేమానురాగాలతో జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అని తెలిపారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సోదర, సోదరీమణులందరు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి  కోరారు. 

చదవండి: అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు: సీఎం జగన్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు