కేసీఆర్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు : క‌విత

12 Oct, 2020 16:49 IST|Sakshi

ప్ర‌జ‌ల‌కు సేవ చేసుకునే అవ‌కాశం వ‌రించింది

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించ‌డం ప‌ట్ల  క‌ల్వ‌కుంట్ల క‌విత ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా జిల్లా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్  అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఈ విజ‌యానికి కృషి చేసిన తెరాస ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు, ఎంపీలు, జడ్పిటిసి, ఎంపీపీ, కార్పొరేటర్, కౌన్సిలర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత కల‍్వకుంట్ల ఘన విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది. దీంతో 14వ ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. (నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం)

ఇక కాంగ్రెస్‌, బీజేపీ డిపాజిట్లు కోల్పోయాయి. టీఆర్‌ఎస్‌కు 728 ఓట్లు రాగా  బీజేపీకి 56, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి.  పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా కవితకు అభినందనలు తెలుపుతున్నారు. రీఎంట్రీ టూ యాక్టీవ్ పాలిటిక్స్‌ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.టీఆర్‌ఎస్‌ విజయంతో నిజామాబాద్‌, కామారెడ్డిలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణాసంచాలు పేలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. (కేబినెట్‌లోకి కవిత: ఎవరికి చెక్‌పెడతారు..!)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా