సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: కవిత

24 Oct, 2020 08:43 IST|Sakshi

ప్రత్యేక వీడియో సందేశం విడుదల 

సాక్షి, నిజామాబాద్‌: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియో సందేశాన్ని శనివారం రోజున విడుదల చేశారు. 'ప్రస్తుతం కరోనా ‌మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ, యూట్యూబ్‌లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నాం.  (బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌)

ఒకపక్క కరోనా, మరోపక్క హైదరాబాద్‌లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనమందరం ఒకరికొకరు అండగా నిలుస్తూ, బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. వరదల‌ కారణంగా నష్టపోయిన వారందరినీ అందుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణ సాయంగా రూ.550 కోట్లను విడుదల చేయడం సంతోషదాయకం. హైదరాబాద్‌ ప్రజల ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు