సెలవుపై వచ్చాడు.. బస్‌లో హైదరాబాద్‌ వెళ్తుండగా ఆర్మీ జవాన్‌ మిస్సింగ్‌!

5 Sep, 2021 11:11 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: కామారెడ్డి జిల్లాలో ఆర్మీ జవాన్ అదృశ్యం అయ్యాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్న కెంగర్ల నవీన్ కనిపించకుండా పోయాడు. కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి గ్రామానికి చెందిన జవాను కెంగర్ల నవీన్ ఆగస్టు 4వ తేదీన సెలవు నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి ఆగస్టు 29న కామారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి జోధ్‌పూర్ వెళ్లేందుకు హైదరాబాద్ బయలుదేరాడు.

నవీన్‌కు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో ఆర్మీ అధికారులకు ఫోన్ చేసి వివరాలు అడిగారు. డ్యూటీకి రాలేదని ఆర్మీ అధికారులు తెలియజేశారు. అనంతరం నవీన్ కుటుంబసభ్యులు బంధువుల వద్ద ఇతర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కామారెడ్డి పట్టణ పోలీసులను ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పాడు.. తీరా చూస్తే!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు