అక్కడ మద్యం అమ్మినా, కొన్నా జరిమానా.. కారణం ఏంటంటే!

25 Nov, 2021 13:40 IST|Sakshi

మద్యం అమ్మినా, కొన్నా జరిమానా

గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం 

సాక్షి, కామారెడ్డి : మద్యం షాపుల ఏర్పాటు కోసం ఒక వైపు జిల్లా యంత్రాంగం టెండర్లు నిర్వహిస్తుంటే మరో వైపు తమ గ్రామంలో మద్యం కొన్నా, విక్రయించినా, బెల్టు షాపులు నిర్వహించినా జరిమానా విధిస్తామని కామారెడ్డి పట్టణానికి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న క్యాసంపల్లి గ్రామానికి చెందిన వారు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.  రచ్చబండ వద్ద సమావేశమై గ్రామంలో మద్యం విక్రయించోద్దని, ఏవరూ తాగవద్దని చర్చించారు. మద్యం కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని భావించారు. గ్రామంలో మధ్య నిషేదం అమలు చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. అన్ని కులాలకు సంబంధించిన కుల పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఒక్కటై మధ్యాన్ని ఏవరూ అమ్మవద్దని, బెల్టుషాపులు నిర్వహించకూడదని నిర్ణయించారు. దీంతో గ్రామంలో మద్య నిషేదం కొనసాగుతుంది.
చదవండి: సఖ్యతకు అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఏమీ ఎరగనట్టు..

కారణం ఏమిటంటే.. 
మిగతా గ్రామాల్లో మాదరిగానే క్యాసంపల్లిలోనూ మద్యం అమ్మకాలు జరిగేవి. పెద్దల నుంచి పిల్లల దాకా అంతా మద్యానికి బానిసలై తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ప్రశాంతంగా ఉండాలంటే మద్యపాన నిషేదమే మేలని భావించి వెంటనే నిర్ణయాన్ని అమలు చేశారు. నెల రోజుల నుంచి గ్రామంలో మద్యపాన నిషేదాన్ని అమలు చేయడంతో గ్రామంలో ఎలాంటి తగదాలు జరగడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులోనూ మద్యం గ్రామంలోకి రాకుండా చూస్తామన్నారు.

అందరి సహకారంతో.. 
గ్రామస్తులందరి సహకారంతోనే గ్రామంలో మద్యపాన నిషేధం అ మలు చేస్తున్నాం. పెద్ద లు, యువకులు, మహి ళల సహకారంతోనే గ్రామంలోని బెల్టుషాపులు నిర్వహించినా, మద్యం విక్రయించినా, కొనుగోలు చేసినా జరిమానా విధిస్తామని తీర్మానించారు. 
– సందరి మంజుల, సర్పంచ్, క్యాసంపల్లి 

రాజకీయాలతో సంబంధం లేదు 
మా ఊర్లో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరం కలిసి తీసుకున్న నిర్ణయం తీసుకున్నాం. మద్యం విక్రయించకూడదని, ఎవరూ కొనుగోలు చేయకూడదని తీర్మానించాం.
– బాలకిషన్‌గౌడ్, ఉపసర్పంచ్, క్యాసంపల్లి   

మరిన్ని వార్తలు