నివేదిక కోరిన డీజీపీ.. సీపీ సీరియస్‌.. తప్పు బాధితుడిదా? పోలీసులదా? 

25 Dec, 2021 11:55 IST|Sakshi
బాధితుడు తనకు ఇచ్చినట్లుగా చెబుతున్న 255/2020 ఎఫ్‌ఐఆర్‌, పోలీసు రికార్డుల్లో ప్రస్తుతం ఉన్న 255/2020 ఎఫ్‌ఐఆర్‌ 

ఇంటి కోసమే డమ్మీ ఎఫ్‌ఐఆర్‌..?

డబుల్‌ ఎఫ్‌ఐఆర్‌పై నివేదిక  కోరిన డీజీపీ కార్యాలయం

ఘటనపై తీవ్రంగా స్పందించిన సీపీ సత్యనారాయణ

తప్పు బాధితుడిదా? పోలీసులదా? 

 ‘సాక్షి’ కథనంతో ఘటనపై ఇంటలిజెన్స్‌ పోలీసుల ఆరా

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఒకే నెంబరుతో రెండు ఎఫ్‌ఐఆర్‌ల విషయం పోలీసు డిపార్ట్‌మెంటులో కలకలం రేపుతోంది. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో శుక్రవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి డీజీపీ కార్యాలయం స్పందించింది. ఈ ఘటనపై తక్షణమే పూర్తి వివరాలతో నివేదిక పంపాలని కరీంనగర్‌ పోలీసులను ఆదేశించింది. సీపీ సత్యనారాయణ కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నారని సమాచారం.

ఒకే నెంబరుతో రెండు కేసులు నమోదవడం రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనూ తాము చూడలేదని పలువురు సీనియర్‌ అధికారులే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఈ విషయం డిపార్ట్‌మెంటులో సరికొత్త చర్చకు దారితీసింది. మరోవైపు ఘటనపై ఇంటలిజె న్స్‌ పోలీసులు కూడా రంగంలోకి దిగి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ డమ్మీ ఎఫ్‌ఐఆర్‌ ఎవరిపని? దీన్ని పోలీసులే సృష్టించి బాధితుడిని భయపెట్టారా? లేక బాధితుడే పోలీసులను అప్రతిష్ట పాలు చేస్తున్నాడా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
చదవండి: డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి..


బాధితుడు తనకు ఇచ్చినట్లుగా చెబుతున్న 255/2020 ఎఫ్‌ఐఆర్‌

అసలేం జరిగింది..?:
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆరెపల్లికి చెందిన నల్లగోపు చంద్రకళ–శ్రీనివాసరావు దంపతులు. మనస్పర్థలతో విడిగా ఉంటున్నారు. తన పేరిట ఉన్న ఇంటిని విక్రయించేందుకు చంద్రకళ సిద్ధపడింది. తన కూతురు పెళ్లికోసమని కొన్న ఇంటిని విక్రయించేందుకు శ్రీనివాసరావు అంగీకరించలేదు. ఈ విషయంలో వీరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ తరువాత ఒకరోజు కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి పిలు పువచ్చింది. మరునాడు కూడా అతన్ని పోలీస్‌స్టేషన్‌కి పిలిపించారు. చేతిలో ఎఫ్‌ఐఆర్‌ పెట్టారు. ‘నిన్ను అరెస్టు చేస్తున్నాం. వైద్యపరీక్షలకు పంపుతాం. దాదాపు ఆరునెలల వరకు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని చెప్పడంతో భయపడిపోయిన.. అతను ఇంటి విక్రయానికి అంగీకరించాడు.

అప్పుడు దంపతులిద్దరూ రాజీ పడుతున్నామని రాసివ్వడంతో జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని, పిలిచినప్పుడు కోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. తనకు ఎంతకూ న్యాయస్థానం నుంచి పిలుపు రాకపోవడంతో అనుమానంతో శ్రీనివాసరావు తన వద్ద ఉన్న ఎఫ్‌ఐఆర్‌ 255/2020 కాపీ వివరాలతో లాయరును ఆశ్రయించారు. అక్కడ అదే నెంబరుతో మరో ఎఫ్‌ఐఆర్‌ ఉందని తెలుసుకుని విస్తుపోయాడు. తన ఇంటిని విక్రయించేందుకే.. ఈ వ్యవహారమంతా నడిపించారని గగ్గోలు పెడుతున్నారు.
చదవండి: అమెరికా అమ్మాయి.. హనుమకొండ అబ్మాయి అలా ఒకటయ్యారు


పోలీసు రికార్డుల్లో ప్రస్తుతం ఉన్న 255/2020 ఎఫ్‌ఐఆర్‌

ఏది నిజం.. ఆ రెండు ఇవే..!
ఇందుకు సంబంధించిన రెండు ఎఫ్‌ఐఆర్‌ కాపీలను ‘సాక్షి’ సంపాదించింది. ఇందులో శ్రీనివాసరావుపై 341,323, 506 సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్‌ నెంబరు 255/2020 పేరుతో ఎస్సై బి.చంద్రశేఖర్‌ ఉదయం 11 గంటల సమయంలో కేసు నమోదు చేశారు. అదే సమయంలో నెంబరుపై ఐపీసీ సెక్షన్లు 290, 324తో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మొ గ్దూంపూర్‌కు చెందిన కేసు నమోదైంది. ఈ కే సును ఎస్సై వి.శ్రీనివాసరావు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసుశాఖ మొదటి ఎఫ్‌ఐఆర్‌పై దృష్టి పెట్టింది. బాధితుడు చెబుతున్న ప్రకారం.. నిజంగానే పోలీసులు దాన్ని సృష్టించారా? లేక పోలీసులపై నిందలు వేసేందుకు బాధితుడే ఇదంతా చేస్తున్నాడా? విషయాలను నిర్ధారించుకునే పనిలో పడ్డారు.

మరిన్ని వార్తలు