మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు

21 Jul, 2021 16:20 IST|Sakshi
న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

సాక్షి, కరీంనగర్‌: మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్‌ మున్సిఫ్‌ జడ్డి ఆదేశించారు. కాగా హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ మార్చి 16న న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి ప్రవీణ్‌కుమార్‌పై ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకపూర్ (ధూళికట్ట) గ్రామంలో జరిగిన స్వేరోస్ భీమ్ దీక్ష సమయంలో కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుకు కరీంనగర్‌ మూడో పట్టణ పోలీసులకు న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ వాలంటరీ రిటైర్మెంట్‌ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. మంగళవారం ఆయనను విధుల నుంచి రిలీవ్‌ చేసింది. ఆయన స్థానంలో ఐఏఎస్‌ అధికారి రోనాల్డ్‌ రాస్‌కు సర్కారు అదనపు బాధ్యతలు అప్పగించింది.

మరిన్ని వార్తలు