కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు ఐఎస్‌వో గుర్తింపు 

10 Jul, 2022 02:21 IST|Sakshi
ఐఎస్‌వో సర్టిఫికెట్‌ అందుకుంటున్న  సీపీ సత్యనారాయణ    

కరీంనగర్‌: కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం (సీపీవో)కు ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్‌డైజేషన్‌ (ఐఎస్‌వో) గుర్తింపు లభించింది. ఆ సంస్థ ప్రతినిధులు శనివారం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణకు ధ్రువీకరణపత్రం అందజేశారు. కమిషనరేట్‌ పరిధిలో పోలీసుల పనితీరు, పరిశుభ్రత, సదుపాయాలు, బాధితులకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఐఎస్‌వో 9001 సర్టిఫికెట్‌కు ఎంపిక చేశారు.

కాగా, కమిషనరేట్‌ పోలీస్‌ కార్యాలయం (సీపీవో) విభాగంలో తెలుగు రాష్ట్రాల్లోనే కరీంనగర్‌ కమిషనరేట్‌ ఎంపికై మేటిగా నిలవడం ప్రత్యేకం. ఈ సందర్భంగా కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ ఐఎస్‌వో గుర్తింపునకు ఎంపికవడం బాధ్యతను మరింత పెంచిందన్నారు. మరిన్ని సమర్థవంతమైన సేవలందించేందుకు ఈ గుర్తింపు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు ఎస్‌.శ్రీనివాస్‌ (ఎల్‌అండ్‌వో) జి.చంద్రమోహన్‌ (పరిపాలన), ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, సి.ప్రతాప్, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి మునిరత్నం పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు