భద్రాద్రిలో 26 నుంచి ‘కార్తీక’ పూజలు 

16 Oct, 2022 00:45 IST|Sakshi

నవంబర్‌ 14న శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభం  

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 26 నుంచి కార్తీక మాస ప్రత్యేక పూజలు జరగనున్నాయి. 26 నుంచి 30వ తేదీ వరకు మణవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తారు. 31న విశ్వక్సేన తిరునక్షత్రం, నవంబర్‌ 1 విశ్వక్సేనుడికి స్నపన తిరుమంజనం, చుట్టు సేవ నిర్వహించనున్నారు. నవంబర్‌ 5న క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా స్వామివారిని జగన్మోహినిగా అలంకరిస్తారు.

8న చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసేసి, గ్రహణం అనంతరం తెరిచి సంప్రోక్షణ చేస్తారు. ఆ రోజున నిత్యకల్యాణం రద్దు చేస్తారు. తిరిగి 9వ తేదీన సుప్రభాత సేవ తర్వాత దర్శనాలు ప్రారంభమవుతాయి. 14వ తేదీన కార్తీక మాస శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభిస్తారు. 20న సర్వ ఏకాదశి సందర్భంగా లక్ష కుంకుమార్చన, ప్రత్యేక పూజలు, 21న కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా గోదావరి నదీ హారతి ఉంటాయని ఆలయ వైదిక కమిటీ సభ్యులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు