కవిత ఫోన్లలో ఏముంది?.. ఈడీ ఆఫీసుకు అడ్వకేట్‌ భరత్‌

29 Mar, 2023 13:26 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. ఇక, లిక్కర్‌ స్కాం కేసులో కవిత ఫోన్‌లకు సంబంధించి కూడా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఫోన్లను ఓపెన్‌ చేస్తున్నారు. 

అయితే, ఫోన్లను తెరుస్తున్న క్రమంలో సాక్షిగా కవిత లేదా ఆమె ప్రతినిధిని ఈడీ ఆఫీసుకు రావాలని అధికారులు కోరారు. దీంతో, కవిత అడ్వకేట్‌ సోమ భరత్‌ రెండో రోజు కూడా ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. వరుసగా రెండో రోజు భరత్‌.. ఈడీ ఆఫీసుకు వెళ్లారు. భరత్ సమక్షంలో కవిత ఫోన్ డేటాను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. ఈ నెల 21న జరిగిన విచారణలో 9 ఫోన్లను కవిత ఈడీ అధికారుల‌కు కవర్‌లో అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో, కవిత ఫోన్లలో ఏముంది? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ సర్కార్‌కు షాక్‌.. 

మరిన్ని వార్తలు