మహిళా రిజర్వేషన్‌ ఉద్యమం ఉధృతం: కవిత 

25 Mar, 2023 03:14 IST|Sakshi

ఉద్యమ కార్యాచరణ పోస్టర్‌ విడుదల 

సాక్షి, హైదరాబాద్‌: చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ‘మహిళలకు, దేశానికి సాధికారిత కల్పిద్దాం. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు ఇవ్వండి. ఈ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు’అంటూ రూపొందించిన పోస్టర్‌ను శుక్రవారం ఆమె విడుదల చేశారు.

మిస్డ్‌కాల్‌ కార్యక్రమంతో పా టు వచ్చే నెలలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, చర్చా గోష్టిలు నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు కోరుతూ దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులకు పోస్టు కార్డులు రాయాలని కవిత నిర్ణయించారు.

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశ పెట్టాలనే డిమాండ్‌తో ఇప్పటికే ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కవిత నిరాహార దీక్ష చేశారు. 18 రాజకీయ పారీ్టలతో పాటు మహిళా సంఘాలతో భారత్‌ జాగృతి రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు