రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

31 Aug, 2021 02:44 IST|Sakshi
ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రాంతం వద్ద శంకుస్థాపన కోసం జరుగుతున్న ఏర్పాట్లు

సెప్టెంబర్‌ 2న పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన.. 3 రోజులపాటు హస్తినలోనే

సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవనానికి శంకు స్థాపన, భూమిపూజ సహా ఇతర కార్యక్రమాల్లో పాల్గొ నేందుకు సీఎం కేసీఆర్‌ బుధవారం మూడు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. బేగంపేట విమానా శ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణం కోసం కేంద్రం కేటాయించిన 1,100 చదరపు మీటర్ల స్థలంలో సెప్టెంబర్‌ 2న మధ్యాహ్నం 12:30కు కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీలో సొంత కార్యాలయ భవనం నిర్మించుకుం టున్న అతికొన్ని ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్‌ఎస్‌ చేరుతోంది. వచ్చే ఏడాది దసరాలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేత లను ప్రారం భోత్సవానికి ఆహ్వానించాలనే యోచ నలో కేసీఆర్‌ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

షెఖావత్, అమిత్‌ షా, నిర్మలతో భేటీలు?
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. అయితే ప్రధాని మోదీతో సీఎం భేటీకి సంబంధించి ఎలాంటి షెడ్యూల్‌ ఖరారు లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ మంగళవారం ఖరారవుతుందని సమా చారం. రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుపై ప్రజాభి ప్రాయ సేకరణ జరిగిన నేపథ్యంలో కేంద్ర జలవన రుల శాఖ మంత్రి గజేంద్ర షెఖావత్‌తో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రా నికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సీఎం సమావేశం కావొచ్చని సమాచారం. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

రూ. 40 కోట్లతో నిర్మాణం...
రూ.40 కోట్ల అంచనాతో నిర్మించే ఢిల్లీ టీఆర్‌ఎస్‌ భవన్‌లో సమావేశ మందిరం, రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చే వారికి బస తదితర సదుపాయాలు ఉండేలా డిజైన్‌ చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ను పోలి ఉండేలా ఢిల్లీ టీఆర్‌ఎస్‌ భవన్‌ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే శంకుస్థాపన చేయాలని కేసీఆర్‌ భావించినా కరోనా రెండో దశ విజృంభణ, లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గతంలో పార్టీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి కార్యాలయ భవన డిజైన్లపై చర్చించారు.  
 

మరిన్ని వార్తలు