నేషనల్‌ పాలిటిక్స్‌పై ప్లాన్స్‌.. సీఎం నితీష్‌తో కేసీఆర్‌ భేటీ.. ఎక్కడంటే?

29 Aug, 2022 19:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు.. జాతీయ రాజకీయాలపై కొద్దిరోజులుగా ఫోకస్‌ పెట్టిన విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో భాగంగా ఇప్పటికే పలువురు సీఎంలను, ప్రముఖులను కలిశారు. కాగా, నేషనల్‌ పాలిటిక్స్‌పై చర్చించేందుకు కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ను కలిసేందుకు సీఎం కేసీఆర్‌ బుధవారం బీహార్‌కు వెళ్లనున్నారు. బీహార్‌ పర్యటనలో భాగంగా గాల్వాన్‌లో అమరులైన ఐదుగురు సైనికుల కుటుంబాలకు కేసీఆర్‌ ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే, ఇటీవలే సికింద్రాబాద్‌ టింబర్‌ డిపో అగ్ని ప్రమాదంలో మృతిచెందిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు సైతం ఆర్థిక సాయం అందజేయనున్నారు. సీఎం నితీష్‌ కుమార్‌తో కలిసి బాధితులకు కేసీఆర్‌ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం, నితీష్‌తో కేసీఆర్‌ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ దొంగల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడున్నారు: కేసీఆర్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు