వీడియో: క్వార్టర్‌, కోళ్లను ఫ్రీగా పంచిన టీఆర్‌ఎస్‌ నేత.. కేటీఆర్‌పై సెటైర్లు

4 Oct, 2022 17:23 IST|Sakshi

వైరల్‌: తెలంగాణ.. జాతీయ స్థాయి రాజకీయాలకు వేదిక కానుందనే చర్చ జోరందుకుంది. దసరా పండుగ నాడు టీఆర్‌ఎస్‌ తరపున కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్నారనే జోష్‌లో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఈ తరుణంలో.. 

వరంగల్ జిల్లాకు చెందిన ఓ నేత కోడి, క్వార్టర్‌ బాటిల్‌ను పంచుతున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఆ వీడియోలో ఉంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజనాల శ్రీహరి అని తెలుస్తోంది. హమాలీలకు దగ్గరుండి మద్యం బాటిళ్లు, కోళ్లను పంపిణీ చేశారాయన. ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్‌గా మారింది. 

దసరా రోజున కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా.. జాతీయ పార్టీ నేపథ్యంలో కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని, ఆయన తనయుడు కేటీఆర్‌ తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను ఆయన ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.

ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. కేసీఆర్ ని ప్రధాన మంత్రిని చేయడానికి టీఆర్ఎస్ నేతలు మద్యం, కోళ్లను పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ''ఇది మీ ఐడియానేనా కేటీఆర్ గారూ?'' అంటూ కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారాయన.

మరిన్ని వార్తలు