వరంగల్‌లో మెడికల్‌ కాలేజీని ప్రారంభించనున్న కేసీఆర్‌ 

1 Oct, 2022 03:18 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11 గంటలకు హనుమకొండ జిల్లా దామెరకు చేరుకోనున్నారు. దామెర క్రాస్‌ వద్ద నిర్మించిన ప్రతిమ రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్, ప్రతిమ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లను కేసీఆర్‌ ప్రారంభిస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వరంగల్‌ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ ప్రావీణ్య, పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషిలతో కలిసి పరిశీలించారు.    

మరిన్ని వార్తలు