గంగ, జమునా తహజీబ్‌కు ప్రతీక: సీఎం కేసీఆర్‌

14 May, 2021 02:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పవిత్ర రంజాన్‌  పర్వ దినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్‌  మాసం శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పెంపొందిస్తుందని.. తెలంగాణలో గంగా, జమునా తహజీబ్‌కు రంజాన్‌  పర్వదినం ప్రతీక అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, గుణాత్మక ఫలితాలనిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు.   
 

ప్రేమ, శాంతి గుణాలకు స్ఫూర్తి రంజాన్‌: గవర్నర్‌  
సాక్షి, హైదరాబాద్‌: రంజాన్‌  పర్వదినం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌  ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ మాసం దయ, దాతృత్వం, సోదరభావం, ప్రేమ, శాంతి గుణాలకు స్ఫూర్తి కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, సౌభాగ్యం, శాంతి రావాలని ఈ శుభసందర్భంగా ఆమె ఆకాంక్షించారు.  

మరిన్ని వార్తలు