సికింద్రాబాద్‌ విధ్వంసం కేసులో కీలక పరిణామం

23 Jun, 2022 16:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విధ్వంసం రోజున ఆవుల సుబ్బారావు ఉప్పల్‌ అకాడమీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు, శివ ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. హకీంపేట సోల్జర్స్‌ గ్రూపులో ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్ట్‌లు పెట్టినట్లు గుర్తించారు. ఆందోళనకు కావాల్సిన లాజిస్టిక్స్‌ సమాకూర్చినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపారు.

విధ్వంసం కేసులో కీలక నిందితులతో సుబ్బారావు ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. కేసులో A2గా ఉన్న పృధ్విరాజ్‌ సాయి డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థిగా గుర్తించారు. నరసారావుపేటలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఆర్మీ కోచింగ్‌ ఇస్తున్నారు. విధ్వంసంలో పలువురు సాయి డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థులు కీలకంగా వ్యవహరించారు. ఇప్పటివరకు 63 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 55 మందిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. మరో ఎనిమిది మంది.. A7, A8, A9, A10, A11, A12, A62, A63 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు.

చదవండి: (కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి)

>
మరిన్ని వార్తలు