ప్రైవేట్‌ ఆస్పత్రిలో టీకా.. హెల్త్‌ డైరెక్టర్‌ కీలక సూచనలు

4 May, 2021 20:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కోవిడ్‌ టీకాల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరోసారి అనుమతించింది. ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వాలని ఆదేశించింది. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే టీకా ఇవ్వాలని సూచించింది.వ్యాక్సిన్‌లను నేరుగా కంపెనీల నుంచి సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా  పాటించాలని తెలంగాణ హెల్త్‌ డైరక్టర్‌ జీ. శ్రీనివాసరావు కోరారు.  
  
కోవిడ్‌ పేషంట్లకు చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రులకు తెలంగాణ హెల్త్‌ డైరక్టర్‌ పలు సూచనలను చేశారు. కోవిడ్‌ పేషంట్లకు  ఆక్సిజన్‌ రేటు 94 శాతం కంటే ఎక్కువగా ఉంటే వారిని హోం ఐసోలేషన్‌, కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు సిఫారసు చేయాలని తెలిపారు. కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నవారిని రిపోర్టులతో సంబంధం లేకుండా ఆస్పత్రుల్లో చేర్చుకోవాలన్నారు. అంతేకాకుండా ఆస్పత్రుల ఎంట్రెన్స్‌ వద్ద బెడ్ల వివరాల పట్టికను ఉంచాలని ప్రైవేటు ఆస్పత్రులకు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ సూచించారు

చదవండి: కరోనా: వీరు మరింత జాగ్రత్తగాఉండాలి!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు