ధైర్యంగా ఉండండి..

4 Sep, 2021 04:19 IST|Sakshi
నాగరాజును ఓదార్చే క్రమంలో ఆయన కుమార్తె రిషితను  ఊరడిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌ దంపతులు

భార్య, కుమారుడు, తమ్ముడిని కోల్పోయిన గన్‌మన్‌కు కలెక్టర్‌ పరామర్శ 

బిడ్డను ఎత్తుకుని ఊరడించిన కలెక్టర్‌ సతీమణి

కొణిజర్ల: రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య, కుమారుడు, తమ్ముడిని కోల్పోయిన గన్‌మన్‌ కుటుంబాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ తన సతీమణి గౌతమితో కలసి పరామర్శించారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ కలెక్టర్‌ వద్ద గన్‌మన్‌గా పనిచేస్తున్న జెర్రిపోతుల నాగరాజు భార్య సంధ్య, కుమారుడు మహంత్, తమ్ముడు పుల్లారావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

ఈ నేపథ్యంలో నాగరాజు స్వగ్రామమైన కొణిజర్లకు శుక్రవారం రాత్రి భార్యతో కలసి వచ్చిన కలెక్టర్‌ గౌతమ్‌ వారి కుటుంబాన్ని ఊరడించారు. కలెక్టర్‌ సతీమణి గౌతమి.. నాగరాజు కుమార్తె, ఆయన తమ్ముడి కుమారుడిని ఎత్తుకుని ఊరడించడమే కాకుండా పుల్లారావు భార్యను ఓదార్చారు.


పుల్లారావు భార్య పద్మను ఓదారుస్తున్న కలెక్టర్‌ సతీమణి గౌతమి 

మరిన్ని వార్తలు