Photo Feature: ఓఆర్‌ఎస్‌ కుండ.. ఎండలో అండ

20 May, 2022 02:35 IST|Sakshi

ఖమ్మం వైద్యవిభాగం: ఎండాకాలం వచ్చిందంటే సహజంగా ఎక్కడైనా దాహార్తి తీర్చడానికి కుండలు.. లేదా మంచి నీటిని అందుబాటులో ఉంచుతారు. కానీ ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది వినూత్నంగా ఆలోచించారు. చల్లని నీటితో దాహార్తి తీరుతుందే తప్ప శక్తి రాదన్న ఉద్దేశంతో...ఆస్పత్రికి వచ్చే వారి కోసం ఓఆర్‌ఎస్‌ నీరు అందుబాటులో ఉంచారు.

ఓఆర్‌ఎస్‌ పౌడర్‌ కలిసిన నీటిని మట్టికుండలో పోసి పెట్టారు. ఆస్పత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సిబ్బంది ఈ కుండను ఏర్పాటు చేయగా.. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న గర్భిణులు, చిన్నారులకు ఉపశమనం లభిస్తోంది.  

మరిన్ని వార్తలు