భళారే బాహుబలి జాతీయ పతాకం

14 Aug, 2022 02:59 IST|Sakshi

ఖమ్మం సహకారనగర్‌: వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. రెండు కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండా, సుమారు 10వేల మందితో శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మెగా ర్యాలీ ఆకట్టుకుంది. ర్యాలీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. ర్యాలీకి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పది వేల మందికి పైగా హాజరయ్యారు.

ర్యాలీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మేయర్‌ పునుకొల్లు నీరజ, సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ అగ్రభాగాన నడిచారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వాన కిలోమీటర్‌ పొడవైన జాతీయ జెండాతో నాలుగు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో 75 బుల్లెట్‌ మోటార్‌ సైకిళ్లపై 15వ బెటాలియన్‌ సిబ్బంది పాల్గొనడం ఆకర్షణగా నిలిచింది.  

మరిన్ని వార్తలు