పల్టీలు కొట్టిన పోలీస్‌ వాహనం.. ఎస్‌ఐకు గాయాలు

6 Apr, 2021 13:46 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఎస్‌ఐ రఘకు త్రటిలో ప్రమాదం తప్పింది. తిరుమలాయపాలెం నుంచి దమ్మాయిగూడెం వైపుకు వెళ్లుతుండగా ఎస్‌ఐ వాహనానికి ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన ఐస్ క్రీం బండిని తప్పించబోయి పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ క్రమంలో లో రెండు పల్టీలు కొట్టింది.

ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో డ్రైవర్‌తో పాటు ఎస్‌ఐ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎస్‌ఐకు స్పల్ప గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే వేరే వాహనం తెప్పించుకోని తిరుమలాయపాలెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం ఎస్‌ఐ తిరిగి మళ్లీ విధుల్లో పాల్గొన్నారు. అయితే ప్రమాద సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

చదవండి: 9 ఏళ్ల బాలిక కిడ్నాప్‌: సినిమా చూపిస్తానని చెప్పి తీసుకెళ్లి..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు