నాలుగేళ్లుగా ప్రేమ, సహజీవనం, పెళ్లి ప్రస్తావన తేవడంతో!

26 Jun, 2021 12:15 IST|Sakshi
దీక్ష చేస్తున్న సింధు

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి దీక్ష

సాక్షి, ఖమ్మం: నాలుగేళ్లుగా ప్రేమించానంటూ కలిసి తిరిగి, జల్సాలకు డబ్బులు వాడుకుని తీరా పెళ్లి ప్రస్తావన తేగానే ప్రియుడు ముఖం చాటేయడంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు పూనుకున్న సంఘటన బోనకల్‌ మండలం రావినూతల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావినూతలకు చెందిన వేణు(22) ఆదే మండలంలోని చిరునోములకు చెందిన సింధు(21) గత నాలుగేళ్గుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వేణు, సింధును వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా చేర్చి అక్కడే ఆమెతో సహజీవనం చేయసాగాడు. ఆమెకొచ్చే జీతంతో జల్సాలు చేయడం మొదలు పెట్టాడు.

కొద్ది రోజుల క్రితం వేణు సింధుకు చెప్పకుండా స్వంత గ్రామానికి వచ్చాడు. సింధు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించడం లేదు. దీంతో శుక్రవారం సింధు రావినూతల వచ్చి ప్రియుడిని గట్టిగా నిలదీయగా పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పా డు. దీంతో మోసపోయానని గుర్తించిన ఆమె తన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి దీక్షకు దిగింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఎస్‌ఐ కొండలరావు సంఘటనా స్థలానికి చేరకుని యువతితో మాట్లాడి న్యాయం చేస్తామని ఇరు కుటుంబాల వారిని పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పెళ్లికి ఒప్పిస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించింది.

చదవండి: సాక్షి, ఎఫెక్ట్‌: తొలగించిన డబ్బా మళ్లీ పెట్టించారు

మరిన్ని వార్తలు