సాక్షి ఎఫెక్ట్‌: ‘కిన్నెరసాని’పై ఇనుప వంతెన ఏర్పాటు

15 Jul, 2021 16:20 IST|Sakshi
కొత్తగా నిర్మించిన వంతెన పైనుంచి వెళ్తున్న స్థానికులు, పోలీసులు

వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’

గిరిజనులకు తాత్కాలిక ఉపశమనం

గుండాల: శాశ్వత పరిష్కారం కాకపోయినా.. కిన్నెరసాని నదిపై తాత్కాలిక ఇనుప వంతెన ఏర్పాటైంది. దీంతో వర్షం వచ్చినప్పుడు నది ఉధృతంగా ప్రవహించినా రాకపోకలు సులభతరం కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మొదుగులగూడెం–నడిమిగూడెం గ్రామాల నడుమ నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ ప్రాంత గిరిజనులు ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా వర్షాలతో నదీ వ్రాహం పెరగగా, గిరిజనులు కట్టెలతో నిచ్చెన మాదిరి ఏర్పాటుచేసుకుని దాటిన విషయమై ‘సాక్షి’లో మంగళవారం ‘ఈ సాహసం ప్రమాదకరమై‘నది’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఎస్పీ సునీల్‌దత్‌ ఆదేశాలతో గుండాల సీఐ శ్రీనివాస్, ఎస్సై ముత్యం రమేశ్‌ సిబ్బందితో కలసి బుధవారం ఇనుప పైపులు, స్లాబ్‌ రేకులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయించారు.

చదవండి: ‘ఈ సాహసం ప్రమాదకరమై‘నది’

మరిన్ని వార్తలు