కేసీఆర్‌ కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు: కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

25 Sep, 2022 12:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. సందర్భంగా వచ్చిన ప్రతీసారి రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌.. కేంద్రంపై విమర్శలు గుప్పిస్తుండగా.. బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారు.

తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. కేసీఆర్‌ పాలనపై మండిపడ్డారు. మంత్రి కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలను కలిసే టైమ్‌ ఉండదు. ప్రజలను అన్ని విషయాల్లో మోసం చేశారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారింది. ఇంకా అప్పులు కావాలని కేంద్రాన్ని కేసీఆర్‌.. బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు.

కేసీఆర్‌ తన వైఫల్యాలను తప్పించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఇవ్వాల్సినవి ఏవీ ఇవ్వరు. ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకిలా మోత అన్నట్టుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఫీజు రీయాంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాద్‌ ముబారక్‌, వ్యవసాయానికి ఇవ్వాల్సిన సబ్సీడీలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన సాల్కర్‌షిప్లులు కూడా ఇవ్వడం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు