ప్రధాని మోదీ రాక.. టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలపై కిషన్‌ రెడ్డి ఫైర్‌

1 Jul, 2022 12:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఏర్నాట్లను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. 

ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యకర్తలను, అభిమానులను సభకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు రోజులపాటు హైదరాబాద్ నగరంలో అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. తెలంగాణ ప్రజలందరూ నరేంద్ర మోదీ పర్యటన కోసం ఎదురుచూస్తున్నారు. బీజేపీ సమావేశాలు విజయవంతంకావాలని ఆకాంక్షిస్తున్నారు. 

తెలంగాణకు ఒకేసారి 18 మంది సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలంతా రావడం అరుదైన దృశ్యం. ఈ కార్యక‍్రమాన్ని బీజేపీ ఒక పండుగ వాతావరణంలో నిర్వహించబోతోంది. తెలంగాణవాసులు ఈ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, దురదృష్టవశాత్తు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు అనేక అవరోధాలు సృష్టిస్తోంది. బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సీఎం కేసీఆర్‌.. పెద్ద ఎత్తున ప్రజాధనం ఉపయోగించి ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. ఇలా వారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కానీ, మేము ప్రజల సహకారంతో ఈ సమావేశాలను విజయవంతం చేస్తాము. దేశాన్ని, రాష్ట్రాలను శక్తివంతంగా తీర్చిదిద్దుతాము అని అన్నారు. 

ఇది కూడా చదవండి: 25 రైళ్లు.. 50 వేల మంది..

మరిన్ని వార్తలు