దివ్యాంగులకు ఎలక్ట్రిక్‌ పరికరాల పంపిణీ 

17 Jul, 2022 02:43 IST|Sakshi

సికింద్రాబాద్‌: దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి అన్నారు. శనివారం సీతాఫల్‌మండిలోని మధురానగర్‌ కాలనీలోని రాఘవ గార్డెన్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సారథ్యంలో నిర్వహించిన దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రూ.కోటి 70లక్షల విలువ గల బ్యాటరీతో నడిచే వీల్‌ చైర్స్, హెల్మెట్లు, వివిధ పరికరాలను 200మంది దివ్యాంగులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఎంతో మంది వికలాంగులను గుర్తించి వారికి కావాల్సిన పరికరాలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి సికింద్రాబాద్‌ జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌ సుందర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి, నేతలు మేకల కీర్తి, బండపెల్లి సతీష్, కనకట్ల హరి, ప్రభుగుప్త, నాగేశ్వర్‌రెడ్డి, గణేష్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు