‘ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వండి’

14 Sep, 2020 18:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌)పై హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. టీఆర్‌ఎస్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఇబ్బందులు పడతారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోమటిరెడ్డి, కోర్టును అభ్యర్థించారు.(చదవండి: రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు: సీఎం కేసీఆర్‌)

కాగా ఎల్‌ఆర్‌ఎస్‌ అంశంపై  ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకానికి సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి కోర్టు ఒకేసారి విచారించనుంది. రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల పరిధుల్లోని అనధికారిక ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు టీ సర్కారు ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు