గురుకుల కళాశాలలో డిప్యూటీ వార్డెన్‌ దారుణం.. విద్యార్థిని తంతూ, కొడుతూ..

23 May, 2022 16:03 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: జిల్లాలోని కోరుట్ల మైనారిటీ గురుకుల కళాశాలలో ఇంటర్‌ విద్యార్థిపై డిప్యూటీ వార్డెన్‌ దాడి చేశాడు. డార్మేటరీ రూమ్‌కు వెళ్లాడని.. తాను చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో.. విద్యార్థి రాజును డిప్యూటీ వార్డెన్‌ కొట్టాడు. రాజును కిందపడేసి కాళ్లతో తంతు పిడిగద్దులు కురిపించాడు. విద్యార్థి ప్రాదేయపడ్డా కూడా కనికరించకుండా మరింతగా రెచ్చిపోయాడు. 

వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. కాలేజీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విషయం ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లడంతో... డిప్యూటీ వార్డెన్‌ నయీమ్‌పై విచారణ చేపట్టారు. విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌ను సస్పెండ్‌ చేశామని రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్‌ సయ్యద్‌ హమీద్‌ తెలిపారు. బాధిత విద్యార్థి రాజు స్వస్థలం జమ్మికుంట అని పేర్కొన్నారు.
చదవండి👇
లంచం డిమాండ్‌ చేసిన డాక్టర్‌.. హరీష్‌రావు రియాక్షన్‌ ఇది
సవతి తల్లి కర్కశం...మేడపై నుంచి తోసి..గొంతు నులిమి

మరిన్ని వార్తలు