నేడు జలసౌధలో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సబ్‌ కమిటీ సమావేశం

17 Sep, 2021 07:09 IST|Sakshi

హైదరాబాద్: జలసౌధలో కృష్ణా, గోదావరి రివర్‌ మేనేజ్మెంట్‌ బోర్డుల సబ్‌ కమిటీ సమావేశం శుక్రవారం జరగనుంది. ఈ సమావేశానికి ఇరురాష్ట్రాల ఇంజనీర్లతో కూడిన ఏడుగురు సభ్యుల బృందం హాజరుకానుంది. కాగా, గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు, తీసుకోవాల్సిన చర్యలపై సబ్‌కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

బోర్డులో సిబ్బంది నియామకం, బోర్డు పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులు, అవసరమైన నిధులు, భద్రత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గెజిట్‌ నోటిఫికేషన్‌ అంశాలను అక్టోబర్‌ 14నుంచి అమలు చేయాలని కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలను కేంద్రం ఆదేశించింది. 

చదవండి: ఆంధ్రా ఆక్వా అంటే.. అమెరికాలో లొట్టలు!

మరిన్ని వార్తలు