తెలంగాణకు 85, ఏపీకి 20 టీఎంసీలు 

22 Mar, 2022 02:12 IST|Sakshi

సాగర్‌ జలాలు కేటాయించిన కృష్ణాబోర్డు 

సాక్షి, హైదరాబాద్‌: వేసవిలో తాగు, సాగు నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ జలా శయంలోని నిల్వల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 20 టీఎంసీలు, తెలంగాణకు 85 టీఎం సీలను కేటాయిస్తూ కృష్ణానది యాజ మాన్య బోర్డు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10న జరిగిన త్రిసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కేటాయింపులు జరిపింది.

మరిన్ని వార్తలు