శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపండి 

26 Nov, 2021 02:04 IST|Sakshi

రెండు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం కుడి, ఎడమగట్టు కేంద్రాల నుంచి విద్యుదుత్పత్తి తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సూచించింది. విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిం ది. ఈ మేరకు బోర్డు సభ్యులు (విద్యుత్‌) ఎల్బీ ముంతంగ్‌ ఈ నెల 18న లేఖ రాశారు.

విద్యుదుత్పత్తి ఆపకుంటే రిజర్వాయర్‌ పరిధిలో తాగు, సాగునీటికి కష్టాలు తప్పవని హెచ్చరించారు. అక్టోబర్‌ 15న జలాశయంలో 885 అడుగుల నీటి మట్టం వద్ద 216.8 టీఎంసీల నిల్వ ఉండగా, నవంబర్‌ 18 నాటికి 856.10 అడుగుల వద్ద 94.91 టీఎంసీలకు తగ్గిపోయాయని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో నిల్వలు గరిష్ట మట్టానికి చేరుకోవడంతో, ఎగువ నుంచి వస్తున్న నీళ్లు వృథాగా సముద్రం పాలు అవుతున్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు