అలాంటి వారు వెంటనే అన్‌ఫాలో కండి: కేటీఆర్‌ 

2 Apr, 2022 16:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ, ఎన్‌డీఏ ప్రభుత్వ పనితీరుపై ట్విట్టర్‌లో తాను పెట్టే పోస్టులతో కుంగిపోయే వారు వెంటనే తనను అన్‌ఫాలో చేయాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. కేంద్ర మతోన్మాద, అసత్య ప్రచారాలను ఎన్ని అడ్డంకులెదురైనా నిలదీస్తూనే ఉంటా నని తేల్చిచెప్పా రు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాగే 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్రం ఏకంగా రూ. 250 పెంచినట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ చేసిన ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ ‘బహుశా ఇది ఏప్రిల్‌ ఫూల్స్‌ జోక్‌ అనుకుంటా’అని పేర్కొన్నారు.  

పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపుపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్‌ ధరలపై మోదీ చేసిన ట్వీట్‌లను ప్రధానికి గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం పెట్రోల్‌ ధరలను భారీగా పెంచడంతో కోట్లాది మందిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాడు మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని చేసిన మరో ట్వీట్‌ను కూడా కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు.
చదవండి: హైదరాబాద్‌లో ఐసిస్‌ కలకలం.. సానుభూతిపరుడు అరెస్ట్‌

మరిన్ని వార్తలు