ప్రపంచం చూపు మన వైపు

5 Aug, 2020 05:08 IST|Sakshi
జినోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ ప్రతినిధులతో కలిసి పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌

ప్రపంచ టీకాల రంగం రాజధాని తెలంగాణ: కేటీఆర్‌

భారత్‌ బయోటెక్, ‘బయోలాజికల్‌ ఇ’ మంచి పురోగతి సాధించాయి

జినోమ్‌ వ్యాలీ సందర్శన, ప్యానల్‌ చర్చలో పాల్గొన్న మంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: ‘టీకా’తాత్పర్యం తెలంగాణ చెప్పగలదని మన దేశమే కాదు, ప్రపంచదేశాలూ భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఇక్కడ కరోనాకు దేశంలో తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ను భారత్‌ బయోటెక్‌ రూపకల్పన చేస్తోంది. ‘బయోలాజికల్‌ ఇ’ కంపెనీ సైతం ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. వ్యాక్సి న్ల తయారీలో ప్రపంచానికి తెలంగాణ రాజ ధాని కావడంతో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద’ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. కరోనా సమస్య పరిష్కారానికి యావత్‌ ప్రపంచం మరోసారి భారతదేశం వైపు చూస్తోందన్నా రు. కరోనాకు దేశంలో తొలి స్వదేశీ వ్యాక్సి న్‌ను భారత్‌ బయోటెక్‌ రూపకల్పన చేయడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.  ‘బయోలాజికల్‌ ఇ’ కంపెనీ సైతం కరోనా వ్యా క్సిన్‌ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశా రు. కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అభివృద్ధిలో పురోగతిని తెలుసుకోవడానికి కేటీఆర్‌ మంగళవారం ఇక్కడి జినోమ్‌ వ్యాలీని సందర్శించి భా రత్‌ బయోటెక్, ‘బయోలాజికల్‌ ఇ’ సంస్థల నాయకత్వ బృందాన్ని కలుసుకున్నారు. టీకా అభివృద్ధిలో ఈ కంపెనీలు ఎదుర్కొం టున్న సవాళ్లను తెలుసుకోవడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన సహకారాన్ని అందించడానికి మంత్రి కేటీఆర్‌ ఈ పర్యటన జరిపారు. 

కరోనా కష్టకాలంలో లైఫ్‌ సైన్సెస్‌ కీలకం
‘వ్యాక్సిన్‌ రేస్‌: బ్యాలెన్సింగ్‌ సైన్స్‌ అండ్‌ అర్జెన్సీ’అనే అంశంపై జినోమ్‌ వ్యాలీలో మంత్రి కేటీఆర్‌ చర్చ నిర్వహించడంతోపాటు సం ధానకర్తగా వ్యవహరించారు. కరోనా కష్టకాలంలో లైఫ్‌ సైన్సెస్‌ రంగం కీలకంగా ఉద్భవించిందని, టీకా పరిశ్రమ అతిపెద్ద ఆశాకిరణంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్త పం పిణీ కోసం వ్యాక్సిన్‌ అభివృద్ధి, ఉత్పత్తిలో భారత వ్యాక్సిన్‌ రంగం కీలక పాత్ర పోషి స్తుందని పదేపదే చెప్పుకుంటున్నారన్నారు. ప్రపంచ వ్యాక్సిన్‌ చిత్రపటంలో హైదరాబా ద్‌కు మాత్రమే ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో టీకాల పరిశ్రమల అభివృద్ధి, కొత్త ఔషధ పరిశ్రమల ఏర్పాటుకు కేటీఆర్‌ దూరదృష్టితో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని భారత్‌ బయోటెక్‌ చైర్మన్, ఎండీ డాక్టర్‌ క్రిష్ణ ఎం.ఎల్లా ప్రశంసించారు.

వ్యాక్సిన్లకు అనుమతిచ్చే ప్ర క్రియను వికేంద్రీకరించాలని, రాష్ట్రాల్లో వీటి కి సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాల ను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారని బయోలాజికల్‌ ఇ సంస్థ ఎండీ మహిమ దాట్ల కొనియాడారు. ప్రపం చంలోని ప్రతి ఒక్కరికీ టీకాలు చేరాలనేది తమ కంపెనీ అభిమతమని చెప్పారు.  విస్తృ త స్థాయిలో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్ష లు నిర్వహించి వైద్యసదుపాయం కల్పించడానికి ప్రభుత్వం సమగ్ర ప్యాకేజీని తీసుకురావాలని డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ అ న్నారు. దేశంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేపనిలో ఉన్న సంస్థలన్నీ ఒకేతాటిపైకి రావాలని, డాక్టర్‌ ఆనంద్‌కుమార్‌ సూచించారు. 

మరిన్ని వార్తలు