కిషన్‌రెడ్డి ‘అభినవ పటేల్‌’ కామెంట్‌కు కేటీఆర్‌ కౌంటర్‌

17 Sep, 2022 12:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పందించారు. 

74 ఏళ్ల క్రితం ఒక హోంమంత్రి ప్రజలను ఐక్యం చేసేందుకు.. తెలంగాణను భారత్‌లో కలిపేందుకు వచ్చారు. ఇవాళ ఒక కేంద్ర మంత్రి (అమిత్‌ షాను ఉద్దేశించి..) వచ్చి ప్రజలను విభజించేలా వ్యవహరించారు. దేశానికి నిర్ణయాత్మకమైన రాజకీయాలు కావాలి కానీ.. విభజన రాజకీయాలు ఉండకూదు అంటూ కేటీఆర్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి.. అమిత్‌ షాను అభినవ సర్దార్‌ పటేల్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహిస్తోంది.

ఇదీ చదవండి: తెలంగాణను మలినం చేసే కుట్ర జరుగుతోంది

మరిన్ని వార్తలు