‘కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు కిషన్‌రెడ్డికి సంబరమా?’

27 Dec, 2022 20:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ నియామకాన్ని రద్దు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన క్రమంలో ఈ కేసులో దొంగల ముసుగులు తొలిగాయన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. హైకోర్టు తీర్పు కేసీఆర్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొనటంపై కౌంటర్‌ ఇచ్చారు. కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు కిషన్‌రెడ్డికి సంబరమా? అంటూ ప్రశ్నించారు. సీబీఐ అంటే సెంట్రల్‌ బీజేపీ ఇన్వెస్టిగేషన్‌ అయ్యిందని ఆరోపించారు. హైదబారాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి కేటీఆర్‌.

‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొంగల ముసుగులు తొలిగాయి. స్కాంలో స్వామీజీలతో సంబంధం లేదన్నవారు సంబరాలు చేసుకుంటున్నారు. సంబంధం లేదన్నవారు దొంగలను భుజాలపై మోస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగిస్తే బీజేపీ సంబురాల మర్మమేంటి? దొంగలకు నార్కో అనాలిసిస్‌, లై డిటెక్టర్‌ టెస్టులకు సిద్ధమా? ఆపరేషన్‌ లోటస్‌ బెడిసికొట్టి అడ్డంగా దొరికారు. నేరం చేసిన వాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోరు. కలుగులో దాక్కున్న దొంగలు మెల్లిగా బయటకు వస్తున్నారు.’ అని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్‌.

ఇదీ చదవండి: హైకోర్టు తీర్పు కేసీఆర్‌ సర్కార్‌కు చెంపపెట్టు: కిషన్‌రెడ్డి

మరిన్ని వార్తలు