దిక్కులేని వారయ్యాం.. ఆదుకోండి

12 Jun, 2021 09:12 IST|Sakshi
శిల్పకు రూ. 2 లక్షలు అందజేస్తున్న ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ 

మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌లో అభ్యర్థించిన మహిళ  

రూ. 2 లక్షలు ఆర్థికసాయం అందజేసిన ఎమ్మెల్యే కిశోర్‌

అర్వపల్లి: సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని చాకలిగూడెంకు చెందిన దర్శనం శిల్ప తమను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో అభ్యర్థించింది. తన భర్త సతీశ్‌.. తొమ్మిది నెలల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించాడని, దీంతో తాను, ముగ్గురు పిల్లలు దిక్కులేని వారమయ్యామని వాపోయింది. స్పందించిన కేటీఆర్‌.. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ను ఆదేశించారు.

దీంతో ఆయన శుక్రవారం చాకలిగూడెం వెళ్లి శిల్ప కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. శిల్పకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం, డబుల్‌బెడ్రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పిల్లలను గురుకుల విద్యాలయాల్లో చదివిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శిల్ప మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కిశోర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: పీఆర్సీ వర్తించేది వీటికే..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు