కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్

5 Mar, 2021 14:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయట్లేదని దక్షణాది రాష్ట్రాలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోందని మండిపడ్డారు. ఆత్మనిర్భర్‌ భారత్ కేవలం నినాదంగానే మిగిలిందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ సదస్సులో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరి అన్నారు.. 60 ఎకరాల ల్యాండ్ అడిగితే 150 ఎకరాలు ఇచ్చాము. కానీ, ఫ్యాక్టరీ లేదు. ఐటీఐఆర్ కారిడార్ రద్దు చేశారు. తెలంగాణకి అన్యాయం చేశారు. మేకిన్ ఇండియా అన్నారు. ఒక్క ఇండస్ట్రియల్‌ జోన్ కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఇక ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఊసులేదు.

కేంద్రం హామీలిచ్చి మారిస్తే ఎవర్ని అడగాలి. ఎలక్షన్స్ కోసం కాదు.. ప్రజలకోసం.. ఇండియా కోసం పనిచేయండి. దిగుమతి సుంకాలు పెంచి మేక్ ఇన్ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా?. తెలంగాణ నుంచి ఎక్కువ  రెవెన్యూ తీసుకుంటూ.. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. బులెట్ ట్రైన్ గుజరాత్‌కి మాత్రమేనా?.. హైదరాబాద్‌కి అర్హత లేదా?. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అడిగాం. కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం ల్యాండ్ ఇస్తామన్నా అస్సలు పట్టించుకోవడం లేదు’’ అని అన్నారు.

చదవండి : ఒక్క పోస్టూ ఖాళీగా ఉండొద్దు

మరిన్ని వార్తలు