KTR: అమిత్‌ షాకు కేటీఆర్‌ కౌంటర్‌

9 Apr, 2022 12:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో కౌంటర్‌ ఇచ్చారు. శనివారం ట్విట్టర్‌ వేదికగా..  దేశంలో ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ‍్వకూడదు. భాషా దురాభిమానం, ఆధిపత్యం బూమరాంగ్‌ అవుతుంది. ఏం తినాలో, ఏం వేసుకోవాలో, ఎవరిని ప్రార్థించాలో మీరే చెబుతారా..? రాష్ట్రాల సమాఖ్య నిజమైన వసుధైక కుటుంబం.

నేను మొదట భారతీయుడిని. ఆ తర్వాతే  గర్వించదగ్గ తెలుగువాడిని, తెలంగాణ వ్యక్తిని. నా మాతృభాష తెలుగు. ఇంగ్లీష్, హిందీ, కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలను. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లీష్‌ భాషను నిషేధించడం వంటివి యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి’’ అని అన్నారు. 

అంతకు ముందు అమిత్‌ షా.. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకొనేప్పుడు ఇంగ్లీష్‌, స్థానిక భాషల్లో కాకుండా హిందీలోనే తప్పక మాట్లాడాలని పిలుపునివ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇది ‘భారతదేశ భిన్నత్వంపై దాడి’ అని ప్రతిపక్షాలు విమర్శించాయి. 

మరిన్ని వార్తలు