అంజలి చదువుకు కేటీఆర్‌ ఆర్థిక సాయం 

26 Aug, 2021 07:35 IST|Sakshi

హసన్‌పర్తి: నిరుపేద కుటుంబానికి చెందిన ఓ విద్యార్థినికి మంత్రి కేటీఆర్‌ చేయూతనిచ్చారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన ఆటోడ్రైవర్‌ మేకల రమేశ్‌ కూతురు అంజలికి రెండేళ్లక్రితం ఐఐటీ (ఇండోర్‌)లో సీటు వచ్చింది. అక్కడికి వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తనకు సాయం చేస్తే ఐఐటీ చదువుతానని అంజలి ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ను కోరింది. స్పందించిన మంత్రి ఆమె ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని అప్పుడే రెండేళ్ల ఫీజు చెల్లించారు.

ఇప్పుడు మరో రెండేళ్ల ఫీజుకు సంబంధించిన సాయాన్ని చెక్కు రూపంలో బుధవారం హైదరాబాద్‌లో అంజలికి అందించారు. ఈ సందర్భంగా ఆమె చదువు, భవిష్యత్‌ ప్రణాళిక గురించి అడిగి తెలుసుకున్నారు. చదువును దిగ్విజయంగా పూర్తిచేసి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అంజలి కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

చదవండి: రేవంత్‌రెడ్డి కొత్త బిచ్చగాడిలా రాష్ట్రంలో తిరుగుతున్నాడు..

మరిన్ని వార్తలు