కేసీఆర్‌ ఇంట్లో ఉండే లిఫ్ట్.. డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లకు!

16 Dec, 2020 12:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వనస్థలిపురంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రూ.28 కోట్లతో3 బ్లాక్‌ల్లో 324 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అయిదేళ్ల క్రితం జై భవాని నగర్‌లో గుడిసెలు ఉండేవని, ఇక్కడున్న వారి కోసం ఆనాడు వెంటనే డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేశామన్నారు. ముఖ్యమంత్రి ఇంట్లో ఉండే లిఫ్ట్ ఈ డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లకు ఏర్పాటు చేశామని తెలిపారు. చదవండి: రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వారం రోజుల్లో గాడిలో


పేదవారి ఆత్మగౌరనికి ఈ డబుల్ బెడ్ రూమ్‌లు ప్రతీక అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 40 నుంచి 50 లక్షల విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎక్కడ తక్కువ కాకుండా పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లన్నీ ప్రైవేట్ గేటెడ్ కమ్మునిటీ ని తలపిస్తున్నాయి. ఉచితంగా ఇల్లు పొందిన ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు