బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ ప్రారంభం

10 Aug, 2020 11:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ను మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ ఎస్సార్‌డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో ఈ ఫ్లైఓవర్‌ ఒకటి. ఎల్‌బీనగర్‌ పరిధిలోని బైరామల్‌గూడ జంక్షన్‌ వద్ద రూ. 26.45 కోట్లతో పూర్తి చేశారు. ఎస్సార్‌డీపీ ప్యాకేజీ-2లో మొత్తం 14 పనులుండగా, ఇప్పటికే ఐదు వినియోగంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభంతో బైరామల్‌గూడ జంక్షన్‌, సాగర్‌రోడ్‌ జంక్షన్‌ల పరిధిలో ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గనుంది. బైరామల్‌గూడ జంక్షన్‌లో రద్దీ వేళల్లో గంటకు 12 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌కు, శ్రీశైలం వైపు వెళ్లే వాహనదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్లైఓవర్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పాల్గొన్నారు.  


మరిన్ని వార్తలు